పూరీ డైరక్షన్ లో నితిన్..!

April 19, 2021


img

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ లవర్ బోయ్ నితిన్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. నితిన్, పూరీ కాంబినేషన్ లో హార్ట్ ఎటాక్ సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నితిన్ మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. 

మాస్ట్రో తర్వాత మరోసారి పూరీ డైరక్షన్ లో నితిన్ హీరోగా సినిమా ఉంటుందని టాక్. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని సెలెక్ట్ చేసినట్టు చెబుతున్నారు. ఉప్పెన సినిమాతో మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి నాని శ్యాం సింగ రాయ్, సుధీర్ బాబు నటిస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ అమ్మడు సైన్ చేసినట్టు తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష