వకీల్ సాబ్ : రివ్యూ

April 09, 2021


img

బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేశారు. ఈ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో చూదాం.

కథ :    

సత్యదేవ్ (పవన్ కళ్యాణ్) ఓ న్యాయవాది. అన్యాయం జరిగిన వారి కేసులను వాధించడంలో అతను ముందుంటాడు. ఎంపితో చేసిన ఛాలెంజ్ లో భాగంగా ముగ్గురు మహిళలకు అండగా ఉండి వారి కేసుని టేకప్ చేస్తాడు సత్యదేవ్. ఎంపి తనయుడు వంశీ కృష్ణ ముగ్గురు మహిళలలో ఒకరైన పల్లవి (నివేదా థామస్) ని మోసం చేస్తాడు. అలాంటి టైం లో ఆ కేసుని టేకప్ చేసిన సత్యదేవ్ ఆ మహిళలను గెలిపించాలని చూస్తాడు. ఎంపి కొడుకుకి సపోర్ట్ గా నందగోపాల్ (ప్రకాశ్ రాజ్) వాధిస్తుంటాడు. సత్యదేవ్ వర్సెస్ నంద గోపాల్ మధ్య జరిగిన ఈ కేసులో ఎవరు గెలిచారు అన్నది సినిమా కథ.

విశ్లేషణ : 

బాలీవుడ్ లో పింక్ సినిమా కథను తెలుగులో తీస్తున్నారు అనగానే అది కూడా పవన్ కళ్యాణ్ తో అనగానే ఆడియెన్స్ లో ఎక్కడో ఓ చిన్న డౌట్ ఉంది. అమితాబ్ చేసిన కథను తెలుగులో ఎంత మార్చినా ఎలా ఉంటుందో అన్న కన్ ఫ్యూజన్. అప్పటికి పవర్ స్టార్ ఇమేజ్ కు తగినట్టుగా కథనం మార్చి కథ లో సోల్ మిస్ అవకుండా చూశామని డైరక్టర్ వేణు శ్రీరాం చెప్పినా సరే అతని మాటలను నమ్మినట్టుగా ఉన్నారు.

ఫైనల్ గా వకీల్ సాబ్ సినిమా చూసిన తర్వాత వేణు శ్రీరాం టాలెంట్ ఏంటో అర్ధమైంది. అతను చెప్పినట్టుగానే మూల కథ అదే అయినా పవన్ ఇమేజ్ కు తగినట్టుగా కథని మార్చిన తీరు బాగుంది. అదే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు నచ్చేసింది. ఫస్ట్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొద్దిగా బోర్ అనిపించినా సెకండ్ హాఫ్ లో కోర్ట్ రూం సీన్స్ అదిరిపోతాయి. సినిమాకు బలం అయిన సన్నివేశాలు ఇవే అని చెప్పొచ్చు. 

ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా బాగా వచ్చాయి. సినిమాలో డైలాగ్స్ అదిరిపోయాయి. ఫైనల్ గా 3 ఏళ్లుగా పవర్ స్టార్ ఫ్యాన్స్ హిట్ సినిమా నిరీక్షణ వకీల్ సాబ్ తో ఫలించింది. ఈ సినిమా ముఖ్యంగా మహిళలకు ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని చెప్పొచ్చు.

నటన, సాంకేతిక వర్గం :

సత్యదేవ్ పాత్రలో పవన్ కళ్యాణ్ అదరగొట్టాడు. తనదైన మేనరిజం.. సినిమాలో తను ఎంచుకున్న పాత్రకు తగినట్టుగా పవర్ స్టార్ మరోసారి తన నటనతో మెప్పించారు. ఇలాంటి కథను ఎంచుకోడానికి ముందు ఆయన గట్స్ కు మెచ్చుకోవాల్సిందే. ఇక సినిమాలో పవన్ తర్వాత అంత గొప్పగా నటించిన వారు అంజలి, నివేదా థామస్, అనన్యా నాగల్ల. ఈ ముగ్గురి నటన అదిరిపోయింది. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ ఇలా వచ్చి అలా వెళ్తుంది. సినిమాలో నంద గోపాల్ గా ప్రకాశ్ రాజ్ మరోసారి తన ప్రతిభ కనబరిచారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ బాగుంది. థమన్ మ్యూజిక్ సినిమాకు సూపర్ గా హెల్ప్ అయ్యింది. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. వేణు శ్రీరాం డైరక్షన్ టాలెంట్ ఏంటన్నది ఈ సినిమా ప్రూవ్ చేసింది.

ఒక్కమాటలో : 

వకీల్ సాబ్ పవర్ స్టార్ సాబ్ వన్ మ్యాన్ షో..!

రేటింగ్ : 3.5/5Related Post

సినిమా స‌మీక్ష