అంజలికి కరోనా.. అసలు విషయం ఇది..!

April 08, 2021


img

సినీ సెలబ్రిటీస్ పై కరోనా అంటూ వస్తున్న వార్తలు కామన్ అయ్యాయి. ఎవరో ఒకరు రాసిన ఒక వార్తని విషయం కన్ ఫర్మ్ చేసుకోకుండా మిగతా వారంతా కవర్ చేస్తున్నారు. మీడియా చూపిస్తున్న ఈ అత్యుత్సాహానికి సెలబ్రిటీస్ తమకు తాముగా క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేటెస్ట్ గా వకీల్ సాబ్ హీరోయిన్ అంజలి కరోనా బారిన పడ్డదని ఓ న్యూస్ మీడియాలో వైరల్ గా మారింది. 

దీనిపై స్వయంగా అంజలి రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. తనకు కరోనా వచ్చింది అంటూ వచ్చిన వార్తలన్ని నిజం కాదని చెప్పింది అంజలి. తను ఆరోగ్యంగా ఉన్నానని తనకు ఎలాంటి అనారోగ్యం కలగలేదని ట్వీట్ చేసింది అంజలి. సెలబ్రిటీస్ అంతా తమకు కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వస్తే వెంటనే తమ సోషల్ బ్లాగుల్లో ఎనౌన్స్ చేస్తున్నారు. అయితే అలా వారు ఎనౌన్స్ చేయకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు వార్తలు రాసేస్తున్నారు. అంజలి కరోనా వార్తలపై మీడియా కొద్దిగా అతి చేసిందని చెప్పాలి. వకీల్ సాబ్ హీరోయిన్ నివేదా థామస్ కు కరోనా రాగా ఆమెతో కలిసి ఇంటర్వ్యూస్ ఇచ్చిందని అంజలికి కరోనా అంటూ వార్తలు రాశారు. తీరా ఆమె క్లారిటీ ఇచ్చాక అసలు విషయం తెలుసుకున్న ఆడియెన్స్ షాక్ అయ్యారు.Related Post

సినిమా స‌మీక్ష