అఖిల్ 'ఏజెంట్' గా వచ్చేశాడు..!

April 08, 2021


img

అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అప్డేట్ వచ్చేసింది. సినిమాకు టైటిల్ గా ఏజెంట్ అని ఫిక్స్ చేశారు. అఖిల్ ఐదవ సినిమాగా వస్తున్న ఈ మూవీ ముహుర్త కార్యక్రమాలు ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. కింగ్ నాగార్జున క్లాప్ కొట్టగా ఈ సినిమా ముహుర్త సన్నివేశం షూట్ చేశారు. ఏజెంట్ సినిమా ను ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.   

అఖిల్ ఏజెంట్ గా ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టాడు. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తుంది. జూన్ 17న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమా తర్వాత అఖిల్ ఏజెంట్ గా వస్తున్నాడు. సైరా నరసింహా రెడ్డి తర్వాత స్టార్ ఛాన్సుల కోసం చూసిన సురేందర్ రెడ్డికి ఫైనల్ గా అఖిల్ అవకాశం దక్కింది. మరి ఏజెంట్ గా సురేందర్ రెడ్డితో అఖిల్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.   Related Post

సినిమా స‌మీక్ష