మారుతి.. రవితేజ.. అంతా సెట్..!

April 08, 2021


img

మాస్ మహరాజ్ రవితేజ.. సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. ఎక్కడ తేడా కొట్టిందో ఏమో కాని రవితేజతో చేయాల్సిన మారుతి గోపీచంద్ తో పక్కా కమర్షియల్ అంటూ వచ్చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజతో సినిమా లైన్ లో పెట్టాడట మారుతి. మారుతి డైరక్షన్ లో రవితేజ సినిమా ఫిక్స్ అని ఫిల్మ్ నగర్ టాక్. 

యువి క్రియేషన్స్ ఫైనల్ గా ఈ కాంబో సెట్ చేసినట్టు తెలుస్తుంది. మారుతి మార్క్ కామెడీ డైరక్టర్ కు.. రవితేజ లాంటి క్రేజీ హీరో దొరికితే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. పక్కా కమర్షియల్ పూర్తి కాగానే ఈ క్రేజీ కాంబో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. రవితేజ కూడా ఖిలాడితో పాటుగా నక్కిన త్రినాథ రావు మూవీని చేస్తున్నాడు. ఆ సినిమాలు పూర్తి కాగానే మారుతి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారు.Related Post

సినిమా స‌మీక్ష