లవ్ స్టోరీ వాయిదా..?

April 08, 2021


img

నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. సారంగ దరియా సాంగ్ తో లవ్ స్టోరీ సినిమాకు సూపర్ బజ్ ఏర్పడగా సినిమా కోసం ఆడియెన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 16న లవ్ స్టోరీ రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేశారు. రీసెంట్ గా తెలుగుతో పాటుగా తమిళ, మళయాళ భాషల్లో లవ్ స్టోరీ రిలీజ్ అని ప్రకటించారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ 16 న రిలీజ్ అవట్లేదని అంటున్నారు.

వారంలో రిలీజ్ ఉంటే తప్పకుండా ఈ సినిమాకు ప్రమోషన్స్ వేరే లెవల్ లో ఉండేవి. కాని అలా కాకుండా లవ్ స్టోరీ చిత్రయూనిట్ చాలా సైలెంట్ గా ఉన్నారు. రిలీజ్ వాయిదా వేసే ఆలోచనతోనే మేకర్స్ ఇలా చేస్తున్నారని తెలుస్తుంది. ఏప్రిల్ 23న రిలీజ్ ప్లాన్ చేసిన టక్ జగదీష్ ప్రమోషన్స్ మొదలు పెట్టాడు నాని. నాగ చైతన్య, సాయి పల్లవిల లవ్ స్టోరీ దాదాపు వాయిదా కన్ ఫాం అయినట్టే. అయితే దీనికి సంబందించిన అఫీషియల్ న్యూస్ రావాల్సి ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగానే లవ్ స్టోరీ రిలీజ్ వాయిదా అంటున్నా లవ్ స్టోరీ రిలీజ్ వాయిదా వెనక అసలు కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు.Related Post

సినిమా స‌మీక్ష