మహేష్.. త్రివిక్రం.. పూజా హెగ్దే..!

April 07, 2021


img

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. పరశురాం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో మహేష్ సినిమా ఉంటుందని తెలిసిందే. అయితే జక్కన్న సినిమా కంటే ముందు మహేష్ ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం త్రివిక్రం డైరక్షన్ లో మహేష్ సినిమా ఉంటుందని టాక్. 

రెండేళ్ల క్రితం మహేష్ బర్త్ డే సందర్భంగా త్రివిక్రం, మహేష్ సినిమా ఎనౌన్స్ మెంట్ చేశారు హాసిని హారిక క్రియేషన్స్. ఆ సినిమాకు త్వరలో ముహుర్తం కుదరబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం త్రివిక్రం శ్రీనివాస్, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది. తారక్ సినిమా తర్వాత మహేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే మహేష్ తో త్రివిక్రం చేసే సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే ఫిక్స్ అని ఫిల్మ్ నగర్ టాక్. మహేష్, పూజా హెగ్దే ఆల్రెడీ మహర్షి సినిమాలో నటించారు.Related Post

సినిమా స‌మీక్ష