నితిన్ 'పవర్ పేట' క్యాన్సిల్..?

April 07, 2021


img

యువ హీరో నితిన్ లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య కాంబినేషన్ లో పవర్ పేట సినిమా గురించి కొన్నాళ్లుగా మీడియాలో డిస్కషన్ నడుస్తుంది. రీసెంట్ గా రంగ్ దే సినిమాతో హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం అందాదున్ రీమేక్ గా వస్తున్న మాస్ట్రో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా తర్వాత అసలైతే పవర్ పేట చేయాల్సి ఉంది కాని ఆ మూవీ విషయంలో నితిన్ వెనక్కి తగ్గాడని తెలుస్తుంది. నితిన్ పవర్ పేట సినిమా దాదాపు క్యాన్సిల్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు.

పవర్ పేట క్యాన్సిల్ కు నితిన్ సినిమాల ఫలితాలే అని తెలుస్తుంది. చెక్ లాంటి ప్రయోగం చేస్తేనే చూడలేని ఆడియెన్స్ పవర్ పేట సబ్జెక్ట్ లో నితిన్ మూడు డిఫరెంట్ షేడ్స్ తో చేస్తే చూస్తారా అన్న డౌట్ రేజ్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు. అందుకే నితిన్ ఆ సినిమాను క్యాన్సిల్ చేశాడని ఫిల్మ్ నగర్ టాక్. మాస్ట్రో తర్వాత నితిన్ చేసే సినిమా ఏది అన్నది త్వరలో ఓ క్లారిటీ వస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష