పుష్ప టీజర్.. తగ్గేదేలే..!

April 07, 2021


img

అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను సుకుమార్ డైరక్షన్ లో చేస్తున్నాడు. పుష్ప టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఒకరోజు ముందే పుష్ప టీజర్ రిలీజ్ చేశారు. 

ఇక టీజర్ చూస్తే ఆడియెన్స్ షాక్ అయ్యారని చెప్పొచ్చు. ఈ సినిమా మొదలైంది లాక్ డౌన్ టైం లో అలాంటి టైం లో ఫారెస్ట్ లో ఇలాంటి లొకేషన్స్.. అవుట్ పుట్ తీసుకు రావడం అంటే మాములు విషయం కాదు. టీజర్ చూసిన ఆడియెన్స్ విజువల్స్ కు ఫిదా అయ్యారని చెప్పొచ్చు. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు మరో హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది. అన్నిటిని మించి పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టాడన్నది చిన్నమాట అవుతుంది. మొత్తానికి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పుష్ప టీజర్ ఉంది. ఆగష్టు 13న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికి పండుగ అని చెప్పొచ్చు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సినిమాను నేషనల్ లెవల్ లో రిలీజ్ చేస్తున్నారు.

Related Post

సినిమా స‌మీక్ష