లైగర్ కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్..!

April 06, 2021


img

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాను ముంబై బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నాడు పూరీ. సినిమాలో విజయ్ సరసన అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యాండీ లాంగ్ ను తీసుకున్నారట. జాకీ చాన్ సినిమాలకు స్టంట్ మాస్టర్ గా చేసిన యాడీ లాంగ్ లైగర్ కోసం పనిచేస్తున్నారు. పూరీ సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. మరి విజయ్ కోసం ఏకంగా హాలీవుడ్ నుండి స్టంట్ మాస్టర్ ను దించారటే ఈ సినిమాలో ఫైట్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని చెప్పొచ్చు.

యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా వస్తున్న లైగర్ సినిమాను సెప్టెంబర్ 9న రిలీజ్ ప్లాన్ చేశారు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల తర్వాత హిట్ టార్గెట్ తో విజయ్ చేస్తున్న సినిమా లైగర్. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న పూరీ డేరింగ్ హీరో విజయ్ దేవరకొండతో చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష