వకీల్ సాబ్ మిడ్ నైట్ షోస్ లేనట్టే..!

April 06, 2021


img

పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మిడ్ నైట్ షోస్ కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ కు నిరాశ మిగిలేలా ఉంది. పవర్ స్టార్ సినిమా మిడ్ నైట్ షోల నుండే హడావిడి చేస్తారు. కాని రాష్ట్ర ప్రభుత్వాలు మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలకు పర్మిషన్ ఇవ్వట్లేదు. నిర్మాత దిల్ రాజు తన పలుకుబడిని ఉపయోగించి ఐదు గంటల ఆటని వేసేలా చర్చలు జరుపుతున్నారు. సో ఎలా చూసినా వకీల్ సాబ్ ను మిడ్ నైట్ లేదా తెల్లవారు ఝామున చూసేద్దాం అనుకున్న పవర్ స్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా లేదు.

అయితే బెనిఫిట్ షోస్ ఉంటాయి కాని అది కూడా రిలీజ్ నాడు ఉదయం 6, 7 గంటలకు షో పడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఫ్యాన్స్ కోసమే మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోస్ వేసినా ఇది మాస్ సినిమా కాదు కాబట్టి టాక్ వేరేలా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దిల్ రాజు కూడా రిలీజ్ రోజు ఉదయం ఆటకే ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష