అఖిల్ సినిమా ఫస్ట్ లుక్ రెడీ..!

April 06, 2021


img

అక్కినేని అఖిల్ త్వరలో బ్యాచ్ లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో అఖిల్ సినిమా ఉంటుందని తెలిసిందే. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఏప్రిల్ 8న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు అఖిల్ సురేందర్ రెడ్డి కాంబో ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతుంది. 

ఫస్ట్ లుక్ తో పాటుగా సినిమా టైటిల్ కూడా రిలీజ్ చేస్తారని టాక్. ఈ పోస్టర్ ఎనౌన్స్ మెంట్ లో భాగంగా ఏ ఈజ్ రెడీ టూ కిల్ అండ్ ఎస్ ఈజ్ రెడీ టూ స్టన్ అంటూ హీరో అఖిల్, డైరక్టర్ సురేందర్ రెడ్డిల పేర్లతో కిల్ల్ అండ్ స్టన్ గా కామెంట్ పెట్టారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా కోసమే అఖిల్ ఈమధ్య బాగా వర్క్ అవుట్స్ చేశాడు. మరి సురేందర్ రెడ్డితో అఖిల్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష