దృశ్యం 2 రిలీజ్ డేట్ ఫిక్స్..!

April 06, 2021


img

మళయాళంలో సూపర్ హిట్టైన దృశ్యం సినిమాను తెలుగులో రీమేక్ చేశారు విక్టరీ వెంకటేష్. ఇక్కడ దృశ్యం సూపర్ హిట్ కాగా రీసెంట్ గా మళయాళంలో వచ్చిన దృశ్యం 2 కూడా ప్రేక్షకులను మెప్పించింది. అమేజాన్ ప్రైం లో రిలీజైనా సరే ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. అందుకే వెంటనే సురేష్ బాబు దృశ్యం 2ని తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు. మాత్రుక దర్శకుడు జీతు జోసెఫ్ దృశ్యం 2 తెలుగు రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నారు.

నెల క్రితం సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయిందని తెలుస్తుంది. దృశ్యం 2ని జూన్ 20న రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ రీమేక్ గా నారప్పలో నటిస్తున్న వెంకటేష్ ప్రస్తుతం ఆ సినిమాని హోల్డ్ లో పెట్టి దృశ్యం 2 ని పూర్తి చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. మరో పక్క F2 సీక్వల్ గా వస్తున్న F3 కూడా ఆగష్టు 27న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ రెండు సినిమాల హడావిడిలో నారప్పని పక్కన పెట్టారు వెంకటేష్.           Related Post

సినిమా స‌మీక్ష