బన్నీతో అనీల్ రావిపుడి..!

April 06, 2021


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేశారు. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ తన సత్తా చాటనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు అల్లు అర్జున్. ఆగష్టు 13న పుష్ప రిలీజ్ ప్లాన్ చేశారు. ఆ సినిమా రిలీజ్ అవడమే ఆలస్యం కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.

కొరటాల శివ సినిమా తర్వాత అసలైతే కొన్నాళ్లుగా వాయిదా పడుతున్న ఐకాన్ చేస్తాడని అంటున్నారు. కాని బన్నీని ఈమధ్యనే కలిసి కథ వినిపించాడట సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి. అనీల్ రావిపుడి సినిమా అంటే పక్కా హిట్ అన్న టాక్ వచ్చింది. కథ దాదాపు ఓకే అయ్యిందట త్వరలో ఫైనల్ మీటింగ్ జరిపి సినిమా ఎనౌన్స్ చేస్తారని తెలుసుతంది. మొత్తానికి అల్లు అర్జున్ తో అనీల్ రావిపుడి సినిమా ఫిక్స్ అని ఫిల్మ్ నగర్ టాక్.Related Post

సినిమా స‌మీక్ష