సినీ కార్మికులకు ఉచిత వ్యాక్సిన్..!

April 05, 2021


img

కరోనా లాక్ డౌన్ టైం లో సినీ కార్మికులను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేశారు. చిరంజీవి అధ్యక్షత వహించగా సినీ సెలబ్రిటీస్ అంతా తమ వంతు సాయాన్ని ఆ చారిటీకి విరాళంగా ఇచ్చారు. ఆ విరాళాలతోనే కరోనా లాక్ డౌన్ టైం లో సినీ కార్మికులకు నిత్యావసరాలను అందించింది. అయితే వాటిలో మిగిలి ఉన్న నిధులను కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు వాడుతామని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి.

వైల్డ్ డాగ్ సక్సెస్ మీట్ లో పాల్గొన్న చిరు కరోనా వ్యాక్సిన్ గురించి ప్రస్తావించారు. సీసీసీలో మిగిలి ఉన్న నిధులతో సినీ కార్మికుల కుటుంబాలకు కరోనా వ్యాకినేషన్ ప్రక్రియ ఏర్పాటు చేస్తామని అన్నారు. సినీ కార్మికులకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ జరిగేలా చూస్తామని చెప్పారు చిరంజీవి. Related Post

సినిమా స‌మీక్ష