నితిన్ సరసన సాయి పల్లవి..!

April 05, 2021


img

లవర్ బోయ్ నితిన్ రీసెంట్ గా వచ్చిన రంగ్ దే సినిమాతో హిట్ అందుకున్నాడు. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నితిన్ ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించింది. ఇక ప్రస్తుతం నితిన్ మేర్లపాక గాంధి డైరక్షన్ లో మ్యాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా చైతన్య కృష్ణ డైరక్షన్ లో పవర్ పేట సినిమా లైన్ లో ఉంది. అయితే నూతన దర్శకుడు డైరక్షన్ లో నితిన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ అందిస్తారని టాక్.

ఈ సినిమాలో నితిన్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఫిదా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కెరియర్ ఫుల్ జోష్ తో కొనసాగిస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం విరాటపర్వం, లవ్ స్టోరీ సినిమాల్లో నటిస్తుంది. సాయి పల్లవి సినిమాలో ఉంది అంటే సంథింగ్ స్పెషల్ ఉన్నట్టే లెక్క. నటనతోనే కాదు తన డ్యాన్స్ తో కూడా ఆడియెన్స్ ను అలరిస్తుంది సాయి పల్లవి. Related Post

సినిమా స‌మీక్ష