కరోనా వార్తలపై స్పందించిన అల్లు అరవింద్.. అవును నాకు కరోనా వచ్చింది కానీ..!

April 05, 2021


img

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు కరోనా పాజిటివ్ వచ్చిన వార్త రెండు రోజులుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. రెండు వ్యాక్సిన్లను తీసుకున్న తర్వాత కూడా అల్లు అరవింద్ కు కరోనా రావడంపై రకరకాలుగా వార్తలు రాశారు. అయితే దీనిపై వివరణ ఇచ్చారు అల్లు అరవింద్. ముగ్గురు స్నేహితులం కలిసి ఊరు వెళ్లొచ్చాం. అందులో తనతో పాటు మరొకరి వ్యాక్సిన్ వేయించుకోగా మరొక స్నేహితుడు వ్యాక్సిన్ వేయించుకోలేదు. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తికి మూడు రోజులు జ్వరం వచ్చి తగ్గింది. ఆ రెండో వ్యక్తికి కరోనా వచ్చి హాస్పిటల్ లో ఉన్నాడు.

తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని.. అయితే తాను వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పెద్దగా ప్రభావం చూపించట్లేదని. కరోనా వ్యాక్సిన్ ఎంత అవసరం అన్నది తన స్నేహితుడిని చూస్తేనే తనకు అర్ధమయ్యిందని. కరోనా వస్తుందని భయపడకుండా వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి అని అల్లు అరవింద్ వీడియో మెసేజ్ ద్వారా చెప్పారు. కరోనా వ్యాక్సిన్ పై డౌట్లు పెట్టుకున్న కొంతమందికి అల్లు అరవింద్ మెసేజ్ వారి ఆలోచనలో మార్పు కలిగిస్తుందని చెప్పొచ్చు. అంతేకాదు మీడియాలో వస్తున్న వార్తలన్నిటికి అల్లు అరవింద్ ఈ మెసేజ్ ద్వారా ఫుల్ స్టాప్ పెట్టగలిగారు.  

Related Post

సినిమా స‌మీక్ష