అరణ్య : రివ్యూ

March 27, 2021


img

దగ్గుబాటి వారసుడు రానా ఓ కమర్షియల్ హీరోగా కాకుండా ప్రయోగాలు చేస్తూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సినీ నేపథ్యం నుండి వచ్చిన రానా హీరోగానే కాదు విలన్ గా కూడా మెప్పిస్తూ వస్తున్నాడు. లేటెస్ట్ గా అతను హీరోగా నటించిన సినిమా అరణ్య. ప్రభు సోల్మన్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. శుక్రవారం రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం. 

కథ :

తమ సొంత భూమి 500 ఎకరాలను ప్రభుత్వానికి రాసిచ్చి అందులో అటవీ జంతువుల సమ్రక్షణ చూస్తున్నాడు. అందులోనే నరేంద్ర భూపతి (రానా) 40 ఏళ్లుగా జీవనం సాగిస్తుంటాడు. ఏనుగులతోనే తన సావాసం అనుకుంటూ వాటి మంచి చెడులు చూసుకుంటూ వెళ్తున్న భూపతి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అటవీ మంత్రి కన్ను ఆ అడవి మీద పడటం అక్కడ 60 ఎకరాల్లో స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయాలనుకోవడంతో అక్కడ ఉన్న ఏనుగుల అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ మంత్రిని అడ్డుకున్న భూపతి విజయం సాధించాడా లేదా అన్నది అరణ్య కథ.

విశ్లేషణ :

అడవిని కాపాడుకోవాలన్న పాయింట్ తో అరణ్య సినిమా కథ రాసుకున్నాడు డైరక్టర్. అయితే సినిమాలో ఇచ్చే సందేశాన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసేలా చెప్పాల్సి ఉంటుంది. ఊరకే మెసేజ్ ఇస్తామంటే ఆడియెన్స్ చూసేయరు. దానికి కొంత కమర్షియాలిటీ అద్దాల్సి ఉంటుంది. అందుకే అరణ్య సినిమాలో పెట్టిన కమర్షియల్ అంశాలు కొద్దిగా గాడి తప్పాయని చెప్పొచ్చు. 

సినిమా మొదలు పెట్టడం చాలా బాగున్నా రాను రాను సినిమా గాడి తప్పినట్టుగా అనిపిస్తుంది. అయితే రానా నటన సినిమాను కొంతమేర కాపాడిందని చెప్పొచ్చు. అంతేకాదు కంప్లీట్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో ఈమధ్య కాలంలో సినిమాలు రాలేదు అందుకే ఈ సినిమా విషయంలో అది కూడా ఓ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా కొత్త కథలు.. డిఫరెంట్ సినిమాలను చూడాలనుకునే ఆడియెన్స్ కు అరణ్య ఎంటర్టైన్ చేస్తుంది.

నటన, సాంకేతిక వర్గం :

భూపతి పాత్రలో రానా మరోసారి తన నటనతో మెప్పించాడు. పాత్రకు ఎంత కావాలో అంత ఇస్తూ సినిమాకు ఆయనే హైలెట్ గా నిలిచాడు. అఫ్కోర్స్ సినిమాలో రానా మాత్రమే ప్రధాన పాత్రదారి కాబట్టి పూర్తి ఫోకస్.. రానా నట విశ్వరూపం ఈ సినిమాతో మరోసారి తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు. సినిమాలో యానిమల్స్ ను కూడా బాగా వాడుకున్నారు. రానా తర్వాత విష్ణు విశాల్ పాత్ర బాగుంది. తన పాత్రలో ఆకట్టుకున్నాడు విష్ణు విశాల్. జోయా హుస్సేన్ క్యారక్టర్ కొద్దిగా క్లారిటీ లేదు కాని పర్వాలేదు అనిపించింది. జర్నలిస్ట్ పాత్రలో శ్రీయ పిల్గోంకర్ జస్ట్ ఓకే అనిపించాడు. అనంత్ మహదేవన్ విలనిజం కూడా అంచనాలను అందుకోలేదు. రఘు బాబు పాత్ర ఓకే అనిపిస్తుంది.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. అశోక్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శాంతను మెయిత్రా మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. డైరక్టర్ ప్రభు సాల్మన్ ప్రకృతి మీద ఉన్న ప్రేమను మరోసారి చూపించాడు. సినిమాలో తన మేకింగ్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. సినిమా కథ బాగున్నా కథనం విషయంలో కొద్దిగా గాడి తప్పినట్టు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఒక్కమాటలో : 

అరణ్య ప్రయణం మంచిదే కాని..!

రేటింగ్ : 2.25/5Related Post

సినిమా స‌మీక్ష