రంగ్ దే : రివ్యూ

March 26, 2021


img

లాస్ట్ ఇయర్ భీష్మ సినిమాతో హిట్ అందుకున్న నితిన్ లాస్ట్ మంత్ వచ్చిన చెక్ తో డిజాస్టర్ అందుకున్నాడు. లేటెస్ట్ గా వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

పక్క పక్క ఇళ్లలోనే ఉండే అర్జున్ (నితిన్), అను (కీర్తి సురేష్). ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. అనుని చూస్తేనే చిరాకు పడతాడు అర్జున్. కాని అను అతన్ని ఇష్టపడుతుంది. అతని మీద ప్రతిసారి గెలవాలని అనుకుంటుంది. అయితే ఇలా గొడవలు పడే ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది.. అది ఎలా..? చిన్నప్పటి నుండి ఒకరంటే ఒకరికి పడని అర్జున్ అను ఎలా దగ్గరయ్యారు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

తొలిప్రేమతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్ను ప్రయత్నం విఫలమైంది. అయితే ఆ సినిమాలో కూడా కామెడీతో మెప్పించాలని చూసినా వర్క్ అవుట్ కాలేదు. అయితే రంగ్ దేలో కూడా వెంకీ మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేశాడని చెప్పొచ్చు. తనకు బలంగా అనిపించిన సన్నివేశాల్లో కామెడీతో నడిపించి.. అవసరం అనిపించిన చోట ఎమోషనల్ టచ్ ఇస్తూ సినిమాను చక్కగా రాసుకున్నాడు.

ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో నడిపించాడు. అయితే ఓ సూపర్ గా నవ్వుకునే కామెడీ కాకపోయినా బోర్ కొట్టించకుండా వెళ్తుందని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ మాత్రం సినిమాకు బాగా హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు. సినిమా సీరియస్ మోడ్ లోకి తీసుకెళ్లి అప్పుడప్పుడు కామెడీతో నవ్విస్తూ ఫైనల్ గా పాస్ అనిపించుకున్నరు.

నటన, సాంకేతికవర్గం :

అర్జున్ పాత్రలో నితిన్ ఎప్పటిలానే ఎనర్జిటిక్ గా నటించాడు. తన కామెడీ టైమినింగ్ ను డైరక్టర్ కరెక్ట్ గా వాడుకున్నాడని చెప్పొచ్చు. ఇక సినిమాలో కీర్తి సురేష్ నటన సూపర్ అనాల్సిందే. మహానటి తర్వాత కీర్తి సురేష్ కు అంత నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇదే అని చెప్పొచ్చు. సినిమాలో కొద్దిగా బక్కగా అనిపించిన కీర్తి సురేష్ తన నటనతో మెప్పించింది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీ సినిమాకు మరో హైలెట్ అని చెప్పొచ్చు. సినిమా కథకు తగ్గట్టుగా తన కెమెరా వర్క్ ఉంది. అంతేకాదు సినిమాకు అది బాగా హెల్ప్ అయ్యింది. ఇక దేవి మ్యూజిక్ మరోసారి మ్యాజిక్ చేసింది. ఒక పాట మినహా మిగతావన్ని సన్నివేశాలకు తగ్గట్టుగా కరెక్ట్ గా పడ్డాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత బడ్జెట్ కావాలో అంతా పెట్టేశారు.

ఒక్కమాటలో :

రంగ్ దే.. టెస్ట్ పాసైన నితిన్..!

రేటింగ్ : 3/5


Related Post

సినిమా స‌మీక్ష