జాతిరత్నాలు : రివ్యూ

March 11, 2021


img

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో యువ హీరోగా తన టాలెంట్ చూపించిన నవీన్ పొలిశెట్టి తన నెక్స్ట్ సినిమాగా చేసిన ప్రయత్నమే జాతిరత్నాలు. అనుదీప్ కెవి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ నిర్మించారు. ప్రచార చిత్రాలతోనే పాపులర్ అయిన జాతిరత్నాలు సినిమా శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి ఈ సమీక్షలో చూద్దాం.

కథ :

జోగిపేటలో పనీపాట లేకుండా తిరుగుంటాడు శ్రీకాంత్ అదే మన హీరో నవీన్ పొలిశెట్టి అతనికి ఇద్దరు తోకలు ఒకరు శేఖర్ ప్రియదర్శి మరొకరి రవి రాహుల్ రామకృష్ణ. ముగ్గురు మంచి స్నేహితులు.. పనిపాట లేకుండా తిరిగే వీళ్లంటే ఊళ్లో వాల్లకి చులకన భావన ఉంటుంది. ఏది పెద్దగా పట్టించుకోని ఈ ముగ్గురు సడెన్ గా ఇంట్లో గొడవ జరగడంతో హైదరాబాద్ వెళ్తారు. అయితే అనుకోకుండా ఈ ముగ్గురు ఓ కేసులో జైలుకి వెళ్తారు. ఇంతకీ ఈ ముగ్గురు హత్య కేసులో ఎలా ఇరుక్కున్నారు..? వాళ్లని అందులో ఇరికించింది ఎవరు..? ఈ ముగ్గురు జైలు నుండి ఎలా బయటపడ్డారు అన్నది సినిమా కథ.  

విశ్లేషణ :  

సినిమా కథగా చెప్పడానికి పెద్దగా మ్యాటర్ లేకపోయినా కథనం సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు జబర్దస్త్ ఆటో రాం ప్రసాద్ వేసే పంచులతో సూపర్ ఫన్ జెనరేట్ చేశారు. సరదాగా ఓ ముగ్గురు స్నేహితులు కలిసి కూర్చుని మాట్లాడుకునే మాటల్లానే డైలాగులు ఉంటాయి. అవే ఆడియెన్స్ ను ఈ సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేశాయి.

సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది.. సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయినట్టు అనిపిస్తుంది. అయితే కామెడీతో కవర్ చేసేశారు. దర్శకుడు తనకున్న కామెడీ సెన్స్ ను సినిమా మొత్తం వాడేశాడు. సినిమా చూసే ఆడియెన్స్ అందరు నవ్వుతూ ఇంటికి వెళ్లడానికి ఫన్ ఫిల్డ్ వన్ లైనర్స్ తో బాగా ఆకట్టుకున్నాడు.

నటన, సాంకేతిక వర్గం :

నవీన్ పొలిశెట్టి ఎలాంటి పాత్రలైనా చేయగలడని ఈ సినిమాలో చేసిన జోగిపేట శ్రీకాంత్ పాత్రతో ప్రూవ్ అయ్యింది. పాత్ర కోసం అతను చేసిన హోం వర్క్ తెర మీద కనిపిస్తుంది. ఏజెంట్ సాయై శ్రీనివాస్ లో నవీన్ కు.. జాతిరత్నాలు నవీన్ కు అసలు సంబంధం ఉండదు. ఇక ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా చాలా బాగా నటించారు. వాళ్లకి ఇలాంటి పాత్రలు చాలా కామన్ అయినా సరే అద్భుతంగా చేశారు. సినిమాలో మురళి శర్మ, తణికెళ్ల భరణి, గిరిబాబు, బ్రహ్మాజి, వెన్నెల కిశోర్ పాత్రలు ఆకట్టుకున్నాయి. జస్టిస్ బల్వంత్ చౌదరి పాత్రలో బ్రహ్మానందం నవ్వించాడు. హీరోయిన్ గా నటించిన ఫరియా అబ్ధుల్లా కూడా బాగా నటించింది.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. సిద్ధమనోహర్ కెమెరా వర్క్ బాగుంది. రధన్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. చిట్టి సాంగ్ రిలీజ్ కు ముందే సూపర్ హిట్టైంది. డైరక్టర్ అనుదీప్ తన పెన్ పవర్ చూపించాడు. కథ ఎలా ఉన్నా కథనంలో ముఖ్యంగా డైలాగ్స్ అదరగొట్టాడు. నాగ్ అశ్విన్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

ఒక్కమాటలో :

జాతిరత్నాలు.. చూసి హాయిగా నవ్వుకోవచ్చు..!

రేటింగ్ : 3/5Related Post

సినిమా స‌మీక్ష