ఉప్పెన 100 కోట్ల పోస్టర్..!

March 06, 2021


img

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జోడీగా బుచ్చి బాబు డైరక్షన్ లో వచ్చిన సినిమా ఉప్పెన. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 12న రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. సినిమా రిలీజైన మొదటి షో నుండి హిట్ అనిపించుకోగా ఫైనల్ గా ఈ సినిమా 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. 

దీనికి సంబందించిన అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశాడు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోగా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా సెన్సేషనల్ హిట్ సాధించింది. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమానే 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవడం మెగా ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తుంది. సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి కూడా మొదటి సినిమాతోనే ఆమె సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఉప్పెన రిలీజ్ అవకుండానే నాని శ్యాం సింగ రాయ్, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాల్లో నటిస్తుంది. ఈమధ్యనే రాం లింగుసామి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.  Related Post

సినిమా స‌మీక్ష