పవర్ స్టార్ తొడకొడతాడా..?

March 06, 2021


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు హర హర వీరమల్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. 17వ శతాబ్ధం నాటి కథతో తెరకెక్కే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది.    

శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తారని టాక్. ఈ టీజర్ కు సంబందించిన అప్డేట్స్ బయటకు వచ్చాయి. సినిమా టీజర్ లో ఓ ఫైట్ సీన్ ఉంటుందని.. అందులో పవర్ స్టార్ తొడ కొడతాడని అంటున్నారు. తొడ కొట్టడం అనేది నందమూరి ఫ్యాన్స్ కు మాత్రమే చెల్లుతుంది. అయితే కొత్తగా ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొడ కొడతాడని తెలుస్తుంది. సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

వకీల్ సాబ్ సినిమాలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమాతో పాటుగా అయ్యప్పనుం కోషియం రీమేక్ లో కూడా నటిస్తున్నాడు. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మాత్రం 2022 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు.Related Post

సినిమా స‌మీక్ష