ఆడవాళ్లు మీకు జోహార్లు.. శర్వా బర్త్ డే స్పెషల్ పోస్టర్..!

March 06, 2021


img

యంగ్ హీరో శర్వానంద్ గత ఏడాది జాను సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. కరోనా కారణంగా గత ఏడాది విడుదల అవ్వాల్సిన శ్రీకారం సినిమా ను ఆలస్యం త్వరలో విడుదల చేయబోతున్నారు. మరో వైపు మహా సముద్రం సినిమాను కూడా శర్వానంద్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరున్న కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. నేడు శర్వానంద్ పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆడవాళ్లు మీకు జోహార్లు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

శర్వానంద్ శ్రీకారం సినిమా రిలీజ్ తో పాటు మహాసముద్రం సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆడవాళ్లు మీకు జోహార్లు షూటింగ్ లో ఈయన జాయిన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దర్శకుడు కిషోర్ తిరుమల ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు. ఒకటి రెండు వారాల్లోనే సినిమా షూటింగ్ ను మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను కూడా ఇదే ఏడాదిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది వృధా అయినందుకు యంగ్ హీరోలు ఈ ఏడాదిలో రెండు మూడు సినిమాలు చేస్తూ వాటిని బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ను కూడా శ్రీకారం మరియు మహాసముద్రం సినిమాలతో పాటు విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో శర్వానంద్ కు జోడీగా రష్మిక మందన్నా ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. Related Post

సినిమా స‌మీక్ష