జక్కన్న మెచ్చిన 'ఆకాశవాణి' టీజర్..!

March 06, 2021


img

అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో సముద్రఖని లీడ్ రోల్ లో నటించిన ఆకాశవాణి సినిమా టీజర్ ను దర్శక ధీరుడు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన టైటిల్ పై ప్రశంసలు కురిపించి చిత్ర యూనిట్ సభ్యులకు గుడ్ లక్ తెలిపారు. ఈ సినిమాను ప్రారంభించి దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. గత ఏడాది విడుదల చేయాలనుకుంటే కరోనా అడ్డు వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. థియేటర్లలో అతి త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు టీజర్ విడుదల సందర్బంగా క్లారిటీ ఇచ్చారు. ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉందని ఆడియెన్స్ అంటున్నారు.     

అటవి ప్రాంతంకు చెందిన అమాయకపు జనాల జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. వారి జీవితంలో చోటు చేసుకున్న ఒక చేదు సంఘటనకు సంబంధించి కథ సాగుతుందని టీజర్ ను బట్టి అర్థం అవుతుంది. పీరియాడిక్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమాలో కనిపిస్తున్న వారు ఎక్కవగా కొత్త వారే. అయినా కూడా ఈ సినిమా లో ట్యాలెంటెడ్ యాక్టర్ అయిన సముద్రఖని మరియు వినయర్ వర్మ లు నటించడం వల్ల సినిమాపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఈ సినిమా కు కాళ భైరవ సంగీతాన్ని అందించడం కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి కలిగేలా ఛేసింది. అశ్విన్ గంగరాజు ఈ సినిమాను వైవిధ్యభరిత కథాంశంతో రూపొందించడంతో పాటు సంగీతం విషయమై కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా టీజర్ బ్యాక్ గ్రౌండ్ ను వింటే అర్థం అవుతుంది. అతి త్వరలోనే ఆకాశవాణి నుండి రిలీజ్ డేట్ వస్తుందేమో చూడాలి.  
Related Post

సినిమా స‌మీక్ష