మహా శివరాత్రికి ఆచార్య సర్ ప్రైజ్..!

March 06, 2021


img

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఉంటుందని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మరియు టీజర్ ను బట్టి అర్థం అవుతుంది. ఆచార్య సినిమా లో చరణ్ కూడా నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరిగాయి. ఇటీవలే మారేడుమిల్లి అటవి ప్రాంతంలో చరణ్ మరియు చిరుల మద్య కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. హైదరాబాద్ లో తుది షెడ్యూల్ ను నిర్వహించి సినిమాను మే 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. అయితే త్వరలో రాబోతున్న మహా శివరాత్రి సందర్బంగా ఆచార్య నుండి రాబోతున్న సర్ ప్రైజ్ ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.      

దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాలు మరియు అవినీతిపై ఈ సినిమా తెరకెక్కతున్నట్లుగా  మొదటి నుండే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం భారీ ఎత్తున టెంపుల్ సిటీనే ఏర్పాటు చేశారు. ఇక ఈ సినిమా కోసం ఒక భక్తి పాటను కూడా దర్శకుడు కొరటాల శివ ట్యూన్ చేయించాడు అంటున్నారు. ఆ భక్తిరస పాటను మహా శివ రాత్రి సందర్బంగా విడుదల చేయడం మంచి నిర్ణయం అనే అభిప్రాయంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారట. అందుకే ఆచార్య లోని మొదటి పాటను శివ రాత్రికి విడుదల చేస్తారనే టాక్ ఉంది. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఆ పనిలోనే ఉన్నాడు అంటున్నారు. పాట కాకున్నా పోస్టర్ అయిన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలోనే చరణ్ బర్త్ డే కూడా ఉంది కనుక ఆ రోజు చరణ్ టీజర్ లేదంటే చరణ్ గా సిద్ద లుక్ ను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. Related Post

సినిమా స‌మీక్ష