రామ్ మూవీలో బేబమ్మ..!

March 05, 2021


img

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా లింగుసామి డైరక్షన్ లో వస్తున్న సినిమా కన్ఫర్మ్ అయ్యింది. ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న రామ్ తన నెక్స్ట్ సినిమాను కోలీవుడ్ డైరక్టర్ తో ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన భామ కృతి శెట్టిని ఫిక్స్ చేశారు. కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న ఈ విషయాన్ని పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు చిత్రయూనిట్.


ఉప్పెన సినిమాతో కృతి శెట్టి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ గా కృతి శెట్టి పేరు మారుమ్రోగుతుంది. ఉప్పెన తర్వాత నాని శ్యాం సింగ రాయ్, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాల్లో నటిస్తున్న కృతి శెట్టి రామ్ మూవీలో కూడా ఛాన్స్ అందుకుంది. చూస్తుంటే కృతి శెట్టి టాలీవుడ్ టాప్ ప్లేస్ కు వెళ్తుందని ఫిక్స్ అవ్వొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష