యశ్ కాదంటే ప్రభాస్ యెస్ అన్నాడా..?

March 05, 2021


img

కె.జి.ఎఫ్ సినిమాతో సౌత్ ఆడియెన్స్ ను మాత్రమే కాదు నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న డైరక్టర్ ప్రశాంత్ నీల్. కె.జి.ఎఫ్ పార్ట్ 1 తో సెన్సేషనల్ హిట్ అందుకోగా ప్రస్తుతం కె.జి.ఎఫ్ చాప్టర్ 2 రెడీ చేస్తున్నాడు. కె.జి.ఎఫ్ 2 రిలీజ్ అవకుండానే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా షురూ చేశాడు ప్రశాంత్ నీల్. సలార్ మొదటి షెడ్యూల్ ఈమధ్యనే పూర్తయింది.

సలార్ సినిమాను 2022 ఏప్రిల్ 14 రిలీజ్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇదిలాఉంటే సలార్ సినిమా యశ్ కాదంటేనే ప్రభాస్ దగ్గరకు వచ్చిందని లేటెస్ట్ టాక్. ప్రశాంత్ నీల్, యశ్ కలిసి సినిమా చేద్దాం అనుకున్న టైం లో సలార్, కె.జి.ఎఫ్ రెండు కథలను చెప్పాడట. అయితే యశ్ సలార్ కథను రిజెక్ట్ చేసి కె.జి.ఎఫ్ ను సెలెక్ట్ చేసుకున్నాడట. అలా యశ్ కాదన్న సలార్ కథతో ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. కె.జి.ఎఫ్ ముందు వరకు కన్నడలో తప్ప సౌత్ లో ఎలాంటి ఇమేజ్ లేని యశ్ చాప్టర్ 1 హిట్ అవడం.. చాప్టర్ 2 టీజర్ కూడా సెన్సేషనల్ అవడం చూస్తుంటే యశ్ సౌత్ స్టార్ గా ఎదగడం కన్ ఫాం అని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష