విజయ్.. సుకుమార్.. మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

March 05, 2021


img

రంగస్థలం తర్వాత సుకుమార్ హిట్టు కొడితే ఆ రీ సౌండ్ ఎలా ఉంటుందో అందరికి అర్ధమైంది. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు సుకుమార్. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే ఈ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు సుకుమార్. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తాడని తెలిసిందే.

విజయ్.. సుకుమార్.. అసలు ఊహించని ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప షూటింగ్ గ్యాప్ లో విజయ్ సినిమా లైన్ పూర్తి చేసిన సుకుమార్.. రీసెంట్ గా విజయ్ దేవరకొండని కలిసి లైన్ చెప్పాడట. సుక్కు చెప్పిన వన్ లైన్ ఆర్డర్ కు విజయ్ ఇంప్రెస్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే సుకుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. సుకుమార్, అల్లు అర్జున్ పుష్ప సినిమా కూడా ఆగష్టు 13న రిలీజ్ ఫిక్స్ చేశారు.

Related Post

సినిమా స‌మీక్ష