ఉప్పెన ఓ అద్భుతం అంటున్న అల్లు అర్జున్..!

March 05, 2021


img

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీగా వచ్చిన ఉప్పెన సెన్సేషనల్ హిట్ అందుకుంది. బుచ్చి బాబు డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను మత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమాకు డిఎస్పి మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందని చెప్పొచ్చు.

ఈ సినిమా చూసిన చాలామంది సెలబ్రిటీస్ తమ స్పందన తెలియచేశారు. లేటెస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉప్పెన సినిమా చూసి తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఉప్పెన చూశాను.. ఇంత అద్భుతమైన సినిమా అందించిన డైరక్టర్ బుచ్చిబాబుకు నా గౌరవాన్ని అందిస్తున్నాను. టెక్నికల్ క్రూ.. డిఓపి గ్రేట్ వర్క్.. డిఎస్పి మ్యూజిక్ సినిమాకు సోల్ గా నిలిచింది. సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లిన విజయ్ సేతుపతి గారికి హ్యూజ్ రెస్పెక్ట్. ఇక హీరోయిన్ కృతి శెట్టి తెలుగులో మంచి డెబ్యూ ఇచ్చారు.. తన పాత్ర చాలా నచ్చిందని అన్నారు అల్లు అర్జున్. ఇక  ముఖ్యంగా నా సోదరుడు వైష్ణవ్ తేజ్ మరే హీరో మొదటి సినిమాకు చూపించిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడని బన్నీ అన్నారు. మొత్తానికి ఉప్పెన టీం కు అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్స్ ఫుల్ ఎనర్జీని ఇస్తాయని చెప్పొచ్చు. 



Related Post

సినిమా స‌మీక్ష