శ్రీకారం ఇంప్రెసివ్ ట్రైలర్..!

March 05, 2021


img

శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా కిశోర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న సినిమా శ్రీకారం. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రాం ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. శివరాత్రి సందర్భంగా మార్చ్ 11న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా ఉన్న శర్వానంద్ ఆ జాబ్ ను వదిలి విలేజ్ కి వచ్చి రైతుగా మారుతాడు. కొత్త ఫార్మింగ్ పద్ధతిలో తనకు ఉన్న ఆలోచనలను ఇంప్లిమెంట్ చేస్తాడు. శ్రీకారం ట్రైలర్ ఇంప్రెసివ్ గా అనిపించింది.     

ట్రైలర్ చూస్తే సినిమాలో మ్యాటర్ ఉన్నట్టే అనిపిస్తుంది. మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఒక సాంగ్ ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యింది. జాను తర్వాత శర్వానంద్ చేసిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉండగా శ్రీకారం ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది వచ్చే గురువారం తెలుస్తుంది. నాని గ్యాంగ్ లీడర్ తర్వాత ప్రియాంకా అరుల్ మోహన్ నటించిన శ్రీకారంతో అయినా అమ్మడు హిట్ కొట్టాలని చూస్తుంది.





Related Post

సినిమా స‌మీక్ష