దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ నటిస్తున్నారు. కొమరం భీం పాత్రలో తారక్, సీతారామరాజు పాత్రలో రాం చరణ్ ఇద్దరు నట విశ్వరూపం చూపించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుండి ఏవో ఒక లీక్స్ వస్తూనే ఉన్నాయి.
లేటెస్ట్ గా సినిమాలో ఎన్.టి.ఆర్ గొలుసులతో కొట్టేసి ఉన్న సన్నివేశానికి సంబందించిన ఫోటో, చరణ్ ఖాకీ డ్రెస్ వేసుకున్న ఫోటో ఒకటి లీక్ అయ్యాయి. షూటింగ్ టైం లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ట్రిపుల్ ఆర్ నుండి ఇలాంటి లీకులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఫోటోల లీకుల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు.. అవి ఎక్కడ నుండి లీక్ అయ్యాయన్న విషయంపై రాజమౌళి సీరియస్ గా ఉన్నారట. ప్రస్తుతం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ రంగంలోకి దిగారు. క్లైమాక్స్ కు సంబందించిన షూటింగ్ జరుగుతుంది. అక్టోబర్ 13న ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ ప్లాన్ చేశారు.