'వకీల్ సాబ్' డిజిటల్, శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్..!

March 03, 2021


img

బాలీవుడ్ పింక్ తెలుగు రీమేక్ గా వకీల్ సాబ్ సినిమాతో వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో పవన్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి జీ సంస్థ కొనేసిందని తెలుస్తుంది. 30 కోట్ల భారీ కోట్ చేసి మరి ఈ సినిమాను కొనేశారట. డిజిటల్, శాటిలైట్ రెండిటితోనే సగం సినిమా పడ్జెట్ రాబట్టారు. ఇక సినిమాకు థియేట్రైకల్ రైట్స్ రూపంలో కూడా భారీ ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం. వకీల్ సాబ్ తో పవర్ స్టార్ పెద్ద టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.  



Related Post

సినిమా స‌మీక్ష