బాలకృష్ణ సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..!

March 03, 2021


img

మాస్ మహరాజ్ రవితేజతో క్రాక్ అంటూ తీసి సూపర్ హిట్ అందుకున్నాడు డైరక్టర్ గోపీచంద్ మలినేని. క్రాక్ హిట్ ఆ డైరక్టర్ పై స్టార్ హీరోల కన్ను పడేలా చేసింది. అందుకే గోపీచంద్ తన నెక్స్ట్ సినిమా నందమూరి బాలకృష్ణతో చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఇక ఇదిలాఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ను తీసుకోవాలని అనుకున్నాడు గోపీచంద్ మలినేని. కాని ఆమె ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తుంది.

బాలయ్య బాబు ప్రతి సినిమాకు హీరోయిన్స్ విషయంలో ఇలాంటి ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. బోయపాటి శ్రీను సినిమాకే ఎవరెవరినో అనుకోగా ఫైనల్ గా ప్రగ్యా జైశ్వాల్ ను ఫిక్స్ చేశారు. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమాకు కూడా హీరోయిన్ దొరకడం కష్టంగానే ఉంది. సీనియర్ హీరోలకు హీరోయిన్స్ విషయంలో ఈ ఇబ్బంది ఎప్పుడూ ఉంటూనే ఉంది. శృతి హాసన్ కూడా పవర్ స్టార్ వకీల్ సాబ్ మూవీలో నటించగా ప్రభాస్ సలార్ ఛాన్స్ కూడా అందుకుందని తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష