ప్రభాస్ సలార్ అమేజాన్ ప్రైమ్ అదిరిపోయే ఆఫర్..!

March 03, 2021


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కె.జి.ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సలార్. ఈ సినిమాను కె.జి.ఎఫ్ నిర్మాతలు తెరకెక్కిస్తున్నారు. కోల్ మైన్ నేపథ్యంతో వస్తున్న సలార్ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

2022 ఏప్రిల్ 14న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా బిజినెస్ ఇప్పుడే మొదలైందని తెలుస్తుంది. సలార్ సినిమా డిజిటల్ రైట్స్ ను అమేజాన్ ప్రైమ్ భారీ రేటుకి కొనేసిందని టాక్. ఇంతవరకు బాలీవుడ్ సినిమాలకు కూడా చేయని కోట్ సలార్ సినిమాకు చేసిందట అమేజాన్ ప్రైం. అయితే ఆ రేటు ఎంత ఏంటి అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష