RRR షూటింగ్ లో హాలీవుడ్ యాక్షన్ డైరక్టర్..!

March 03, 2021


img

రాజమౌళి సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేలా చేస్తాడు. మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుండి బాహుబలి మొదటి రెండు పార్టుల వరకు రాజమౌళి తన సినిమాల్లో యాక్షన్ పార్ట్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో కలిసి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ లను దించారు రాజమౌళి.

గ్లాడియేటర్, ది బోర్న్ ఐడెంటిటీ లాంటి సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన నిక్ పావెల్ ను ఆర్.ఆర్.ఆర్ యాక్షన్ సీన్స్ డైరెక్ట్ చేసేందుకు తీసుకున్నారట. రాజమౌళి తనకు కావాల్సిన సీన్ గురించి చెప్పగా యాక్షన్ కొరియోగ్రాఫర్ వింటున్న ఓ వీడియో ఆర్.ఆర్.ఆర్ టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. సినిమాలో రామరాజుగా చరణ్, కొమరం భీం పాత్రలో తారక్ ఇద్దరు తమ నట విశ్వరూపం చూపిస్తారని తెలుస్తుంది.




Related Post

సినిమా స‌మీక్ష