పవన్ కళ్యాణ్ 'సత్యమేవ జయతే' సాంగ్ రిలీజ్..!

March 03, 2021


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ సినిమా తెలుగు రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ తో పాటుగా శృతి హాసన్, నివేదా థామస్, అంజలి వంటి స్టార్స్ నటిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా నుండి మగువ సాంగ్ రిలీజ్ కాగా సినిమా నుండి సత్యమేవ జయతే సాంగ్ రిలీజ్ చేశారు.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న వకీల్ సాబ్ నుండి వచ్చిన ఈ సెకండ్ సింగిల్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. పవన్ సినిమాలో పాత్ర గురించి మాత్రమే కాదు బయట ఆయనకు ఉన్న ఇమేజ్ కు తగినట్టుగా ఈ పాట లిరిక్స్ రాసినట్టు తెలుస్తుంది. మగువ సాంగ్ తోనే అదరగొట్టిన థమన్ ఈ సత్యమేవ జయతే సాంగ్ తో మరోసారి సూపర్ అనిపించేసుకున్నాడు.



Related Post

సినిమా స‌మీక్ష