బ్యాచ్ లర్ హిట్ కొడితే.. బన్నీ ఛాన్స్ వచ్చినట్టే..!

February 27, 2021


img

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. అఖిల్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఫలితం మీద అఖిల్ తో పాటుగా భాస్కర్ ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉంది. బ్యాచ్ లర్ సినిమా అనుకున్న విధంగా హిట్టైతే మాత్రం భాస్కర్ కు అల్లు అర్జున్ మూవీ ఛాన్స్ వస్తుందని అంటున్నారు.

అఖిల్ సినిమా హిట్టు పడితే మాత్రం భాస్కర్ ఫేట్ మారినట్టే. ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత భాస్కర్ తో సినిమా ఉంటుందని చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి పరుగు సినిమా చేశారు. మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అయితే మరో మంచి సినిమా వస్తుందని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష