అనసూయ ఐటం సాంగ్ ప్రోమో వచ్చేసింది..!

February 27, 2021


img

జబర్దస్త్ బ్యూటీ అనసూయ బుల్లితెర మీదే కాదు సినిమాలతో సిల్వర్ స్క్రీన్ మీద కూడా సత్తా చాటుతుంది. డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తున్న అనసూయ స్పెషల్ సాంగ్స్ కు సై అనేస్తుంది. సాయి ధరం తేజ్ విన్నర్ సినిమాలో సూయ సూయ సాంగ్ లో ఆడిపాడిన అమ్మడు లేటెస్ట్ గా కార్తికేయ హీరోగా వస్తున్న చావు కబురు చల్లగా సినిమాలో కూడా ఐటం సాంగ్ చేసింది. ఈ సాంగ్ కు సంబందించిన ప్రోమో లేటెస్ట్ గా రిలీజైంది.

అనసూయ ఐటం సాంగ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ సినిమాను కౌశైక్ డైరెక్ట్ చేశారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 19న రిలీజ్ ఫిక్స్ చేశారు. అనసూయ ఐటం సాంగ్ ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంటే ఇక సాంగ్ థియేటర్ లో అదరగొట్టడం ఖాయమని చెప్పొచ్చు.

Related Post

సినిమా స‌మీక్ష