నాని కథతో వైష్ణవ్ తేజ్..?

February 27, 2021


img

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో సెన్సేషనల్ హిట్ అందుకోగా ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో సినిమా రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఇక వైష్ణవ్ తేజ్ థర్డ్ మూవీ కింగ్ నాగార్జున ప్రొడక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమాతో పాటుగా ప్రముఖ నిర్మాత బోగవల్లి ప్రసాద్ తో వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేస్తాడని తెలుస్తుంది. కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఆ కథను నానికి వినిపించాడట బోగవల్లి ప్రసాద్. అయితే నానికి కథ నచ్చినా ఎందుకో చేయనని చెప్పారట. అందుకే నాని కాదన్న ఆ కథతో వైష్ణవ్ తేజ్ తో సినిమా చేయాలని చూస్తున్నారు. నాని వి తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. టక్ జగదీష్, శ్యాం సింగ రాయ్ రెండు సినిమాలు భారీ అంచనాలతో వస్తున్నాయి.Related Post

సినిమా స‌మీక్ష