ఎన్.టి.ఆర్ తో సేతుపతి..?

February 22, 2021


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ముందు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తీయాలని అనుకోగా ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ ఎలాగు నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంటాడు కాబట్టి సినిమాను కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

ముందు అనుకున్న కథ పక్కన పెట్టి కొత్త కథ సిద్ధం చేశారట. ఇక ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కు విలన్ గా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకోవాలని చూస్తున్నారట. రీసెంట్ గా వచ్చిన ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి నటన అందరిని సర్ ప్రైజ్ చేసింది. దర్శకుడు రాసుకున్న పాత్రకి అద్భుతమైన తెరరూపం అందించాడు విజయ్ సేతుపతి. అందుకే ఉప్పెన సినిమా గురించి మాట్లాడితే విజయ్ సేతుపతి నటన గురించి చెప్పుకుంటున్నారు. అందుకే విజయ్ సేతుపతిని విలన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. కోలీవుడ్ సూపర్ బిజీ ఆర్టిస్ట్ అయిన విజయ్ సేతుపతి తెలుగులో వచ్చిన ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటాడా లేదా అన్నది చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష