నిఖిల్ తో అనుపమ.. రిపీట్..!

February 22, 2021


img

యువ హీరో నిఖిల్ ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులతో రాబోతున్నాడు. అందులో ఒకటి 18 పేజెస్ కాగా.. మరొకటి కార్తికేయ 2. కుమారి 21ఎఫ్ డైరక్టర్ సూర్య ప్రతాప్ డైరక్షన్ లో వస్తున్న 18 పేజెస్ సినిమాకు సుకుమార్ కథ అందించారు. ఇక ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. 18 పేజెస్ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాతో పాటుగా కార్తికేయ 2 సినిమా కూడా సెట్స్ మీద ఉంది. కార్తికేయ హిట్ అవడంతో చందు మొండేటి ఈ సీక్వల్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. కార్తికేయ 2 సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తుంది. నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ ఒకేసారి రెండు వరుస సినిమాలను చేస్తూ అలరిస్తున్నారు. మరి వీరి కెమిస్ట్రీ స్క్రీన్ మీద ఎలా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష