ఉప్పెన 'క్లాసిక్' అనేసిన మహేష్..!

February 22, 2021


img

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు డైరక్షన్ లో వచ్చిన సినిమా ఉప్పెన. ఈ సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమా రిలీజై 10 రోజులుగా వసూళ్లతో అదరగొడుతుంది. ఇప్పటికే సినిమా 40 కోట్ల మార్క్ దాటేసిందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా చూసిన సెలబ్రిటీస్ ఇప్పటికే సినిమా గురించి ప్రస్థావించి సినిమాకు పనిచేసిన వారిని మెచ్చుకున్నారు. మెగా హీరో మొదటి సినిమా గురించి సూపర్ స్టార్ మహేష్ ప్రశంసల వర్షం కురిపించాడు. రీసెంట్ గా సకారు వారి పాట దుబాయ్ లో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఉప్పెన సినిమా చూసిన మహేష్ సినిమా గురించి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. సినిమా దర్శకుడికి నిన్ను చూసి గర్వపడుతున్నాను అంటూ మహేష్ చెప్పడం అందరిని ఆశ్చర్యపరచింది.

సినిమా మేకర్స్, నటీనటులు, మ్యూజిక్ డైరక్టర్ ఇలా అందరి గురించి ఐదారు ట్వీట్స్ చేస్తూ వచ్చాడు మహేష్. సూపర్ స్టార్ కు ఎంతగానో నచ్చింది కాబట్టే ఈ సినిమా గురించి ఇలా స్పందించారని తెలుస్తుంది. మొత్తానికి ఉప్పెన టీం మహేష్ ట్వీట్స్ తో మరింత ఉత్సాహంగా ఉన్నారని చెప్పొచ్చు.

Related Post

సినిమా స‌మీక్ష