చిత్రం సీక్వల్.. తేజ సూపర్ సర్ ప్రైజ్..!

February 22, 2021


img

తేజ డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీస్ లో ఒకటి చిత్రం. అప్పటివరకు కెమెరా మెన్ గా కెరియర్ సాగించిన తేజ తన డైరక్షన్ లో చేసిన మొదటి సినిమా చిత్రం. ఈ సినిమాతోనే ఉదయ్ కిరణ్ వెండితెరకు పరిచయమయ్యాడు. ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా నటించిన చిత్రం అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. జూన్ 16, 2000 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది చిత్రం. సినిమా వచ్చిన 20 ఏళ్ల తర్వాత మళ్లీ సీక్వల్ స్టార్ట్ చేస్తున్నారు.

తేజ డైరక్షన్ లో చిత్రం సీక్వల్ గా చిత్రం 1.1 మూవీ వస్తుంది. టైటిల్ వైరటీగా పెట్టిన తేజ సినిమా కథను కూడా ఇప్పటి యువతని ఆకట్టుకునేలా రాసుకున్నారని తెలుస్తుంది. ఈ సినిమాతోని కూడా కొత్త నటీనటులను తెరకు పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారట. చిత్రం సినిమాకు మ్యూజిక్ అందించిన ఆర్.పి పట్నాయక్ ఈ సీక్వల్ సినిమాకు మ్యూజిక్ అందిస్తారని తెలుస్తుంది. ఈరోజు తేజ బర్త్ డే సందర్భంగా చిత్రం సీక్వల్ చిత్రం 1.1 ఎనౌన్స్ చేశారు. సినిమా నటీనటులు మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష