సీటీమార్ టీజర్.. గోపీచంద్ మార్క్..!

February 22, 2021


img

మాస్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న గోపీచంద్ కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన సక్సెస్ లు లేక వెనకపడ్డాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా సీటీమార్ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. సంపత్ నంది డైరక్షన్ లో వస్తున్న సీటీమార్ సినిమా టీజర్ లేటెస్ట్ గా రిలీజైంది. యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. కబడ్డి కోచ్ గా పనిచేసే గోపీచంద్ కు విలన్లకు మధ్య జరిగే గొడవే సీటీమార్ సినిమా కథ.

ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. కబడ్డీ.. మైదానం లో ఆడితే ఆట.. బయట ఆడితే వేట అనే డైలాగ్ బాగా హైలెట్ అయ్యింది. గోపీచంద్ లుక్స్ కూడా ఈ సినిమాలో కొత్తగా ఉన్నాయని చెప్పొచ్చు. మాస్ సినిమాతో తన టాలెంట్ చూపిస్తున్న సంపత్ నంది గోపీచంద్ కు సీటీమార్ తో హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన గౌతం నందా టార్గెట్ మిస్సైంది. కాని సీటీమార్ మాత్రం ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కించారని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఏప్రిల్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Related Post

సినిమా స‌మీక్ష