నాంది చేయాల్సింది నరేష్ కాదా..?

February 20, 2021


img

అల్లరి నరేష్ హిరోగా విజయ్ కనకమేడల డైరక్షన్ లో వచ్చిన సినిమా నాంది. ఫ్రై డే రిలీజైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తుంది. అయితే నరేష్ కొన్నాళ్లుగా చేస్తున్న సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతుండగా ఈ సినిమా మాత్రం మంచి టాక్ తెచ్చుకుందని తెలుస్తుంది. నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ గా ఈ సినిమాలోని నటన గురించి చెప్పుకుంటున్నారు.

అన్యాయం జరిగిన వ్యక్తి.. తనకు జరిగే న్యాయం కోసం పోరాడే కథతో నాంది వచ్చింది. రెగ్యులర్ గా కామెడీ సినిమాలు చేస్తూ వచ్చిన నరేష్ ఈసారి తన పంథా మార్చేసినట్టు తెలుస్తుంది. నాంది సినిమా అల్లరి నరేష్ కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమా డైరక్టర్ విజయ్ ముందు ఈ కథను నరేష్ కు కాకుండా శర్వానంద్ కు వినిపించారట. సినిమా కథ బాగున్నా తను వరుస సినిమాలు కమిట్ అవడంతో శర్వానంద్ నాంది సినిమాను వదులుకున్నాడని తెలుస్తుంది. ఫైనల్ గా నాంది నరేష్ కు కొత్త జోష్ ఇచ్చింది. 

నాంది సక్సెస్ టాక్ రావడంతో అల్లరి నరేష్ ఎనిమిదేళ్లుగా ఈరోజు కోసం చూస్తున్నానని కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. ఇంతకుముందు తన సినిమాలు చూసి నరేష్ కామెడీ బాగుందని అన్నారు కాని నాంది సినిమా చూసి నరేష్ నటన బాగుందని అంటున్నారని చెప్పాడు. ఫైనల్ గా నరేష్ నాందితో అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టే అని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష