ఉప్పెనని చూసిన బాలయ్య..!

February 20, 2021


img

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చి బాబు డైరక్షన్ లో వచ్చిన సినిమా ఉప్పెన. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 12న రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. సినిమా చూసిన ప్రేక్షకులంతా సూపర్ అనేస్తున్నారు. వారం రోజుల్లో 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఉప్పెన 100 కోట్ల వసూళ్ల వైపు దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాను చూసిన సెలబ్రిటీస్ కూడా తమ స్పందన తెలియచేస్తున్నారు.

లేటెస్ట్ గా నందమూరి నట సింహం బాలకృష్ణ స్పెషల్ స్క్రీనింగ్ లో ఫ్యామిలీ మొత్తం కలిసి ఉప్పెన చూశారని తెలుస్తుంది. ఈ సినిమా చూసిన బాలయ్య ఉప్పెన యూనిట్ ను ప్రశంసించారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ పేజ్ లో బాలకృష్ణ, బుచ్చి బాబు కలిసి దిగిన ఫోటో షేర్ చేసి బాలయ్య ఉప్పెన సినిమాను చూశారన్న విషయాన్ని వెళ్లడించారు. 

Related Post

సినిమా స‌మీక్ష