టక్ జగదీష్ టీజర్ పోస్టర్..!

February 20, 2021


img

నాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన నిన్ను కోరి సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇద్దరి కాంబోలో వస్తున్న సెకండ్ మూవీ టక్ జగదీష్ మీద అంచనాలు పెరిగాయి. 

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో నానికి ఈక్వల్ రోల్ లో జగపతి బాబు నటిస్తున్నాడని తెలుస్తుంది. ఐశ్వర్యా రాజేష్, రీతు వర్మ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 16న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 23 సాయంత్రం 5:04 నిమిషాలకు రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక టీజర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ టక్ వేసుకున్న జగదీష్ మాస్ లుక్ తో కనిపించాడు.

వి సినిమాతో నిరాశపరచిన నాని టక్ జగదీష్ తో సత్తా చాటాలని చూస్తున్నడు. షైన్ స్క్రీన్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా ఫలితంపై నాని పూర్తి నమ్మకంగా ఉన్నాడని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష