ఉప్పెన : రివ్యూ

February 12, 2021


img

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ లీడ్ రోల్ లో బుచ్చి బాబు డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా ఉప్పెన. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

కథ :

ఉప్పడ గ్రామంలో పెద్ద మనిషిగా ఉన్న రాయనం ప్రాణం కన్నా పరువుకి ఎక్కువగా విలువ ఇస్తాడు. కూతురు సంగీత అలియాస్ బేబమ్మ ఇల్లు వదిలి వెల్లి ఐదు నెలలు అవుతున్నా సరే ఊళ్లో వాళ్లకి.. ఇంట్లో ఎవరికి తెలియకుండా తెలిసినా అడగకుండా చేస్తాడు. అయితే కూతురు బయటకు వెళ్లినా సరే ఆమె ఎప్పటికైనా వస్తుందని భావిస్తాడు రాయనం. ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే జాలరి కొడుకు ఆసి (వైష్ణవ్ తేజ్) తో ప్రేమలో పడుతుంది బేబమ్మ. ఓ రాత్రి మొత్తం సముద్రంలో ఆసి, బేబమ్మ గడుపుతారు. విషయం తెలిసిన రాయనం కూతురిని ఇంటికి తీసుకెళ్తాడు. ఆసికి కఠిన శిక్ష విధిస్తాడు. ఇంతకీ రాయనం ఆసికి వేసిన శిక్ష ఏంటి..? అది బేబమ్మని అతనికి దూరం చేసిందా.. నిజమైన ప్రేమ కోసం బేబమ్మ ఏం చేసింది అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

డైరక్టర్ బుచ్చి బాబు కొత్త దర్శకుడే అయినా అతను రాసుకున్న సీన్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఇక హీరో, హీరోయిన్ కూడా కొత్త వారు కావడం చేత ఆడియెన్స్ కు ఇంకాస్త బాగా నచ్చేసింది. సినిమాలో లవ్ సీన్స్ అన్ని సూపర్ గా రాసుకున్నాడు. అవి తెర మీద చూపించడంలో కూడా సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగా రాసుకున్న డైర్క్టర్ సెకండ్ హాఫ్ అసలు పాయింట్ విషయంలో కొద్దిగా తడపడ్డాడాని అనిపిస్తుంది.

సినిమా సెకండ్ హాఫ్ నుండి ప్రీ క్లైమాక్స్ కు వెళ్లడం వరకు బాగున్నా.. చివర్లో కొద్దిగా ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ లో డైరక్టర్ ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నాడో అది మాత్రం కన్విన్స్ అయ్యేలా చేశాడు. రొటీన్ లవ్ స్టోరీస్, కమర్షియల్ ఎంటర్టైనర్స్ కు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. సినిమా కథ, కథనాలు దర్శకుడు ఇంప్రెస్ అయ్యేలా రాసుకున్నాడు. యూత్ ఆడియెన్స్ మెచ్చే అంశాలు. లవ్ సీన్స్ ఇవన్ని సినిమా వారికి కనెక్ట్ అయ్యేలా చేసింది. 

నటన, సాంకేతిక వర్గం : 

వైష్ణవ్ తేజ్ మొదటి సినిమానే అయినా చాలా బాగా చేశాడు. కొన్ని సీన్స్ లో మేనమామలు కనిపించారు. ఇక హీరోయిన్ కృతి శెట్టి సూపర్ గా నటించింది. తెలుగులో అమ్మడికి మంచి ఛాన్సులు వస్తాయి. ఇక సినిమాలో విలన్ గా నటించిన విజయ్ సేతుపతి అదరగొట్టాడు. రాయనం పాత్రలో విజయ్ సేతుపతి అభినయం హైలెట్ అని చెప్పొచ్చు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు ఎంత కావాలో అంత బడ్జెట్ ఇచ్చేసినట్టు అనిపిస్తుంది.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. డైరక్టర్ బుచ్చి బాబు తన ప్రతిభతో మెప్పించాడు. సినిమా చూసి ఎవరైనా అనుభవం ఉన్న దర్శకుడు చేసినట్టుగా అనిపిస్తుంది. సినిమా సినిమాటోగ్రఫీ బాగుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు మరో హైలెట్ అని చెప్పొచ్చు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు ఎంత కావాలో అంత బడ్జెట్ ఇచ్చేసినట్టు అనిపిస్తుంది.  

ఒక్కమాటలో :

యువతని మెప్పించే ఉప్పెన లాంటి ప్రేమకథ..!

రేటింగ్ : 3/5



Related Post

సినిమా స‌మీక్ష