'రిపబ్లిక్' టైటిల్ తో దేవా కట్టా మరో ప్రస్థానం..!

January 25, 2021


img

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్, దేవా కట్ట డైరక్షన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ గా రిపబ్లిక్ అని ఫిక్స్ చేశారు. జెబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మరో ప్రస్థానంగా వస్తుందని తెలుస్తుంది. రిపబ్లిక్ టైటిల్ తో దేవా కట్టా మరోసారి తన పెన్ పవర్ ఏంటన్నది చూపించబోతున్నాడు. ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.  

రిపబ్లిక్ సినిమా మోషన్ పోస్టర్ తో దేవా కట్టా సర్ ప్రైజ్ చేశాడు. సినిమాను సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈమధ్యనే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో హిట్ అందుకున్న సాయి ధరం తేజ్ దేవా కట్ట రిపబ్లిక్ తో పాటుగా సుకుమార్ అసిస్టెంట్ కార్తిక్ డైరక్షన్ లో ఓ పిరియాడికల్ మూవీ చేస్తున్నాడు. సాయి తేజ్ కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా అది వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. 

Related Post

సినిమా స‌మీక్ష