పుష్ప.. సగం బడ్జెట్ వారికేనా..?

January 25, 2021


img

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో క్రేజీ మూవీగా వస్తున్న పుష్ప సినిమా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లిలో జరుపుకుంటుంది. అల్లు అర్జున్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమాగా పుష్పపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గ్తకుండా సినిమా ఉంటుందని అంటున్నారు. 100 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్, డైరక్టర్ సుకుమార్ రెమ్యునరేషన్లే బడ్జెట్ లో సగం అవుతుందని తెలుస్తుంది.

ఇద్దరు కలిసి 50 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇది కాకుండా లాభాల్లో వాటా కూడా కావాలని అడిగారట. సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు కాబట్టి బిజినెస్ బాగానే జరుగుతుంది. అందుకే అల్లు అర్జున్ భారీ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పుష్ప సినిమాలో బన్నీ ఊర మాస్ లుక్ తో కనిపిస్తాడని అంటున్నారు. లారీ డ్రైవర్ గా తనలోని మాస్ యాంగిల్ తో మరోసారి ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నారు స్టైలిష్ స్టార్. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా ఈ ఇయర్ లోనే సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష